* ఉచిత వినికిడి, కంటి పరీక్షల వైద్య శిబిరం
* మాజీ ఎమ్మెల్యే గండ్ర బర్తే సందర్భంగా నిర్వహణ
* బీఆర్ఎస్ నాయకుడు వైనాల రాజేందర్ (రాజు)
స్పాట్ వాయిస్, శాయంపేట : భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్ ఎస్ నాయకులు, సామాజిక సేవకుడు వైనాల రాజేందర్ (రాజు) ఆధ్వర్యంలో అక్షయ-ఆకృతి ఫౌండేషన్ వారి సహకారంతో ఈనెల 5వ తేదీన హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని ఎస్ వీకేకే ఫంక్షన్ హాల్ మెగా ఉచిత వినికిడి మరియు కంటి పరీక్షల వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. శిబిరంలో హైదరాబాదుకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుల చేత వినికిడి, కంటి పరీక్షలు నిర్వహించి లోపం ఉన్నవారికి వెంటనే నాణ్యమైన వినికిడి యంత్రాలు, కళ్లద్దాలు అందించనున్నామని వైనాల రాజేందర్ (రాజు) తెలిపారు. అలాగే మండలంలోని అంగవైకల్యం కలిగిన వ్యక్తులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను కూడా అందిస్తామన్నారు. మెగా హెల్త్ క్యాంపును శాయంపేట మండల ప్రజలంతా లోసద్వినియోగం చేసుకోవాలని రాజు తెలిపారు.

