ePaper
Thursday, May 14, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ఊరికి వెళ్తున్నారా... ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఊరికి వెళ్తున్నారా… ఈ జాగ్రత్తలు తప్పనిసరి

📰 Generate e-Paper Clip

ఊరికి వెళ్తున్నారా… ఈ జాగ్రత్తలు తప్పనిసరి

రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డి

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: వేసవి సెలవుల సందర్భంగా చాలామంది ప్రజలు తమ స్వగ్రామాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఇంటి భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రఘునాథపల్లి సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

సూచనలు ఇవే..

👉ఇంటిని పూర్తిగా లాక్ చేసి వెళ్లాలి

👉పక్కింటి వారికి లేదా బంధువులకు సమాచారం ఇవ్వాలి

👉విలువైన నగదు, బంగారం బ్యాంక్ లాకర్లలో ఉంచాలి

👉సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి

👉ఇంటి బయట లైటింగ్ సరిపడా ఉండేలా చూడాలి

👉చెరువులు, కుంటలు, కాలువల వద్ద చిన్నారులు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

👉 ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా నియంత్రణ అవసరo.

వేసవి జాగ్రత్తలు..

👉ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు తగినంత నీరు తీసుకోవాలి.

👉హీట్ స్ట్రోక్ నుంచి రక్షణ చర్యలు పాటించాలని రఘునాథపల్లి సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular