రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పై మంత్రివర్గ నిర్ణయాన్ని అమలు చేయాలి
రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ
స్పాట్ వాయిస్ హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 100 రోజుల్లోగా 2024 సం. నుండి పెండింగ్ లో ఉన్న రూ. 6,200 కోట్ల రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలు, బెనిఫిట్స్ లను విడుదల చేయడానికి తీసుకున్న నిర్ణయంను వరంగల్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.శుక్రవారం జిల్లా పరిషత్ లో గల పి ఆర్ టి యు భవనంలో కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు యం డి అబ్దుల్ గఫార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్మెంట్ బకాయిల సాధన కమిటీ రాష్ట్ర కో- కన్వీనర్ శ్రీ ధర్ల ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ లు మాట్లాడుతూ.. ఇన్నాళ్లు ఆలస్యమైనా ఈ నిర్ణయంను స్వాగతిస్తూ, ఎటువంటి వాయిదాలు వేయకుండా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ఎక మొత్తంలో చెల్లించి, కేబినెట్ నిర్ణయాన్ని అమలు పరచాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ తరపున ధన్యవాదములు తెలియజేశారు. మార్చి 2024 నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెన్ ఫిట్స్ అందక అనేక కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయని, తాము పనిచేస్తున్న కాలంలో జీత బత్యాల నుండి పొదుపు చేసిన డబ్బులు, రిటైర్మెంట్ అయిన వెంటనే ఒకేసారి వస్తాయి అని, వాటితో తమ పిల్లల పెళ్ళీలు,గృహ నిర్మాణంలు, చదువుల కోసం తీసుకున్న రుణాలు,అనారోగ్యంతో ఉన్నవారికి మెరుగైన వైద్యం కోసం ఉపయోగపడతాయని ఆశ పడ్డామని, కానీ ఆశలను అడియాశలు చేస్తూ, చెల్లింపులు లేకపోవడం వలన ఎంతో మంది మానసికంగా కృంగి పోయి ,అనారోగ్యం పాలై, గత అక్టోబర్ 25 నుండి నేటి వరకు 91 మంది రిటైర్డ్ ఉద్యోగులు చని పోవడం జరిగిందన్నారు. ఇంకా వందలాది మంది హాస్పిటల్ లో ఉన్నారని, కొంత మంది కోర్టు కు వెళ్లడంతో, కోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోక పోవడం వలన, కంటెంట్ ఆఫ్ కోర్టు కింద ప్రభుత్వం పై కోర్టు సిరియస్ కావడంతో కొంతమందికి పెండింగ్ బకాయిలను ప్రభుత్వం చెల్లించడం జరిగిందన్నారు.రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వ ,ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించడం, అనేక నిరసనలు ధర్నాలు చేపట్టి,చివరికి ఉద్యోగ జేఏసీ కూడా ఉద్యమించడంతో రిటైర్డ్ ఉద్యోగుల బాధలను ప్రభుత్వం గుర్తించి, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు 100 రోజుల్లో చెల్లించడానికి నిర్ణయం తీసుకొని, అమలుకై “రెవెన్యూ రిసోర్స్ ఒబిలైజేషన్ కమిటీ” ఏర్పర్చి, దాని ద్వారా నిధులు సేకరిస్తూ, సమస్య పరిష్కారానికి వచ్చే నెల 4వతేదిన జరగబోయే క్యాబినెట్ సమావేశంలో స్పష్టమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించనుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వంద రోజుల్లో రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిలను చెల్లించి, ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నాము అని అన్నారు.అదేవిధంగా ఆర్టీసీ కార్మికుడి మరణం విచారకరమని, ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి కి శ్రద్దాంజలి ఘటించారు. ఆవేశంతో ప్రాణాలు తీసుకోరాదని, ఉద్యమాల ద్వారానే హక్కులు సాధించుకోవాలని, తొందరపాటుతో ఆత్మస్థైర్యాన్ని కొల్పోకూడదని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ, ఆర్టీసీ కార్మికుల సమ్మె కు మా మద్దతు ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సహా కార్యదర్శి మేకేరి దామోదర్, ఇ. ఇంద్ర సేనా రెడ్డి, విశ్వనాథం, బత్తిని సారయ్య,శ్యామ్ క్షీర సాగర తదితరులు పాల్గొన్నారు.

