
కేటీపీపీలో అగ్ని ప్రమాదంపై వదంతులు నమ్మవద్దు
- నిప్పు అంటుకుంది గడ్డికే
- ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు..
- అధికారుల స్పష్టీకరణ
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కేటీపీపీ ప్లాంట్లోని ఖాళీ స్థలంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై ప్లాంట్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. సోలార్ ప్లాంట్ కోసం ఉంచిన స్థలంలోని ప్రహరీ గోడ వద్ద ఉన్న గడ్డికి నిప్పు అంటుకోవడంతో పొగ వ్యాపించిందని, వెంటనే స్పందించి దానిని అదుపు చేశామని తెలిపారు. ఈ సంఘటనలో జెన్కోకు సంబంధించి ఎటువంటి ఆస్తి నష్టం సంభవించలేదని పేర్కొన్నారు. మిల్ రిజెక్ట్స్, బొగ్గు నిల్వల వల్ల ప్రమాదం జరగలేదని, బొగ్గు యార్డు ఈ ప్రాంతానికి చాలా దూరంలో ఉందని, బొగ్గు నిల్వలు సురక్షితంగా ఉన్నాయని అధికారులు ఆ ప్రకటనలో వివరించారు. కాగా, అగ్నిప్రమాదంపై మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ఈ సందర్భంగా వారు కోరారు.

