ePaper
Wednesday, April 15, 2026
ePaper
Homeతెలంగాణఅమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

📰 Generate e-Paper Clip

                                                                  సామాజిక సేవలో ముందు ఉండాలి… 

జనగామ జిల్లా జడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు బొల్లం అజయ్.. 

స్పాట్ వాయిస్,రఘునాథ్ పెల్లి : మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అమ్మవారి దీవెనలతో సంతోషంగా ఉండాలని, స్నేహభావంతో ఐక్యమత్యంతో ఉండాలని జనగామ జిల్లా జడ్పీటీసీ ఫోరం మాజీ అధ్యక్షుడు రఘునాథపల్లి మాజీ జెడ్పీటీసీ బొల్లం అజయ్ అన్నారు. బుధవారం రఘునాథపల్లి మండల కేంద్రంలో ఆర్ వీ ఎస్ కాంప్లెక్స్ ఉప్పలమ్మ గుడి వద్ద మొక్కులు అప్పగించి ప్రత్యేక పూజలు చేశారు. అనoతరం జెడ్పీటీసీ బొల్లం అజయ్ మాట్లాడుతూ.. మండల ప్రజలందరూ అమ్మవారి దీవెనలతో సంతోషంగా ఉండాలని.. అమ్మ వారిని కోరుకున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు రైతు బంధు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ పల్లి మండల సీనియర్ జర్నలిస్టులు చింతకింది కృష్ణమూర్తి, వెల్ది గ్రామ ఉప సర్పంచ్ ఎడ్ల బాలరాజు, బీ ఆర్ ఎస్ రఘునాథపల్లి మండల యూత్ అధ్యక్షులు దుబ్బాక హరీష్ గౌడ్, పేర్ని ప్రసాద్ కురుమ,జనగామ జిల్లా డివైఎఫ్ఐ అధ్యక్షుడు పంతం సాయి ప్రసాద్ గౌడ్, దుబ్బాక అజిత్, డి వై ఎ ఫ్ నాయకులు జనగామ జిల్లా కురుమ సంఘం నాయకులు పేర్ని లెనిన్ కురుమ, మేకల విశాల్, గ్రామ ప్రముఖులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular