ePaper
Thursday, July 30, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్రోడ్డు భద్రత నియమాలు పాటిద్దాం.. ప్రాణాలను కాపాడుకుందాం..

రోడ్డు భద్రత నియమాలు పాటిద్దాం.. ప్రాణాలను కాపాడుకుందాం..

📰 Generate e-Paper Clip

విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన ఎస్సై నరేష్ యాదవ్…

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా బుధవారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని సెయింట్ ఆల్ఫోన్సస్ పాఠశాల ఆవరణంలో అలైవ్-అరైవ్ కార్యక్రమాన్ని ఎస్సై దుదిమెట్ల నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ… రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడిపి నడపాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపోద్దని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలని సూచించారు. మైనర్ల కు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular