రోడ్డు భద్రత నియమాలు పాటిద్దాం.. ప్రాణాలను కాపాడుకుందాం..
విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన ఎస్సై నరేష్ యాదవ్... స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా బుధవారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని సెయింట్ ఆల్ఫోన్సస్ పాఠశాల ఆవరణంలో అలైవ్-అరైవ్ కార్యక్రమాన్ని ఎస్సై దుదిమెట్ల నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ... రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడిపి నడపాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపోద్దని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలని సూచించారు. మైనర్ల కు...