ePaper
Friday, July 31, 2026
ePaper
Homeతెలంగాణరోడ్డు ప్రమాదాల నివారణలో అందరూ భాగస్వాములు కావాలి

రోడ్డు ప్రమాదాల నివారణలో అందరూ భాగస్వాములు కావాలి

📰 Generate e-Paper Clip

ఎస్సై దూదిమెట్ల నరేష్ యాదవ్…
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్… అలైవ్ కార్యక్రమం ద్వారా వాహనదారులకు భద్రత నియమాలపై అవగాహన కల్పిస్తున్నామని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రఘునాథపల్లి సబ్ ఇన్ స్పెక్టర్ దుదిమెట్ల నరేష్ యాదవ్ అన్నారు. సోమవారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆవరణంలో జరిగిన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ బొల్లం ఉమారాణి అధ్యక్షత వహించగా ఎస్సై పాల్గొని మాట్లాడారు. హెల్మెట్ వినియోగం. సీటు బెల్టు ప్రాధాన్యత.. డిప్రెషన్ డ్రైవింగ్ నియమాలను ప్రతి ఒక్కరు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని చెప్పారు. ఈనెల 16వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొల్లం ఉమారాణి, ఉప సర్పంచ్ దేవర యాకయ్య. పంచాయతీ కార్యదర్శి బాలకిషన్, వార్డు సభ్యులు యాదరాములు, ఇమ్మడిశెట్టి అనిత, సురేష్ శ్రీనివాస్, వివో సి ఏలు మినుముల పద్మావతి, కోళ్ల కీర్తన, లక్ష్మి, అంగన్ వాడీ టీచర్లు కవిత, శ్రీలత నాగమణి, ఆటో యూనియన్ అధ్యక్షుడు అడ్డూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular