స్పాట్ వాయిస్, దామెర: యుధులకు రాజు ఏసు ప్రభువు అని పాస్టర్ కిషోర్ పాల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో తెలుగు బాపిస్ట్ చర్చి ఆధ్వర్యంలో క్రైస్తవులు మట్టల ఆదివారం పండుగను భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మట్టలు చేతబూని పాటలు పాడుతూ, నినాదాలు చేస్తూ బ్యాండ్ సప్పుడుతో వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ కిషోర్ పాల్, స్టాండింగ్ పెద్దలు దామెర సదానందం,వార్డు సభ్యులు వేల్పుల ప్రసాద్, రవీందర్, బాబు, అఖిల్,కీర్తన, వనిత, వెన్నెల, రాధ తదితరులు పాల్గొన్నారు .

