ePaper
Saturday, August 1, 2026
ePaper
Homeఎడిటోరియల్జీవితం ఇద్దరు అన్నయ్యను ఇచ్చింది..

జీవితం ఇద్దరు అన్నయ్యను ఇచ్చింది..

📰 Generate e-Paper Clip

బావలు కాదు.. అన్నయ్యలే

  • మెగాస్టార్‌, నాగబాబులనై పవన్ సతీమణి అన్న కొణిదెల ఎమోషనల్ పోస్ట్!

స్పాట్ వాయిస్ , హైదరాబాద్: మెగా అభిమానులకు పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ఒక బ్యూటిఫుల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌లతో కలిసి ఉన్న ఒక క్యూట్ ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలో చిరంజీవి ఎంతో ఆప్యాయంగా అన్నా కొణిదెల బుగ్గ పట్టుకుని నవ్విస్తుండగా, పక్కనే ఉన్న పవన్ వారిని చూసి మురిసిపోతున్నారు. ఈ అరుదైన చిత్రంతో పాటు ఆమె పంచుకున్న ఒక ఎమోషనల్ నోట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

  • ‘అన్నయ్య’ అని ఎందుకు పిలుస్తానంటే.

మెగాస్టార్ చిరంజీవిని, నాగబాబును తాను ఎందుకు ‘అన్నయ్య’ అని పిలుస్తానో ఈ పోస్ట్ ద్వారా అన్నా కొణిదెల అభిమానులతో పంచుకున్నారు. దాదాపు పదిహేనేళ్ల క్రితం తాను మెగా కుటుంబంలోకి అడుగుపెట్టిన కొత్తలో.. ఎవరిని ఏమని పిలవాలో, వారితో ఎలా కలిసిపోవాలో తనకు తెలిసేది కాదన్నారు. ఆ సమయంలో తన భర్త పవన్ వాడే పదాలనే తాను అరువు తెచ్చుకున్నానని చెప్పారు. అలా పవన్ పిలిచినట్లే తాను కూడా చిరంజీవిని, నాగబాబును ‘అన్నయ్య, చిన్న అన్నయ్య’ అని పిలవడం మొదలుపెట్టానని ఆమె గుర్తు చేసుకున్నారు.

  • సైలెంట్‌గా ఇద్దరు అన్నయ్యలను ఇచ్చింది!

మొదట్లో కాస్త భయపడుతూనే ఆ పదాలను వాడినా.. రాను రాను అది ఒక ఫీలింగ్‌లా మారిపోయిందని అన్నా కొణిదెల తెలిపారు. నిజానికి వారిని వరుసకు ‘బావగారు’ అని పిలవాలని తనకు తర్వాతే తెలిసిందని, కానీ అప్పటికే భాషతో సంబంధం లేకుండా వారి మధ్య ఒక బలమైన ఎమోషనల్ బాండ్ ఏర్పడిపోయిందని చెప్పుకొచ్చారు. “నాకు సొంత అన్నయ్యలు లేరు.. కానీ జీవితం చాలా సైలెంట్‌గా నాకు ఇద్దరు అన్నయ్యలను ఇచ్చింది” అంటూ చిరంజీవి, నాగబాబులను ట్యాగ్ చేస్తూ తన ఆప్యాయతను చాటుకున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోతో పాటు అన్నా కొణిదెల రాసిన క్యాప్షన్ మెగా అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది. మెగా బ్రదర్స్ మధ్య ఉన్న అనుబంధాన్ని, ఆ కుటుంబం తనను ఆదరించిన తీరును ఆమె వ్యక్తపరిచిన విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular