ePaper
Thursday, May 14, 2026
ePaper
Homeఎడిటోరియల్సుప్రీం కోర్టు సంచలన తీర్పు

సుప్రీం కోర్టు సంచలన తీర్పు

📰 Generate e-Paper Clip

సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిచిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పులో హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా ఇతర మతాల్లోకి (ముఖ్యంగా క్రైస్తవం, ఇస్లాం) మారిన వ్యక్తి ఎస్సీ (షెడ్యూల్డ్ కులం) హోదా కోల్పోతాడని స్పష్టం చేసింది.

ఈ రోజు తీర్పు సారాంశం

ఎస్సీ హోదా ప్రస్తుత రాజ్యాంగ నియమాల (షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ 1950) ప్రకారం హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లో మాత్రమే ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. ఇంకే మతంలోకి మారితే ఆ హోదా తాత్కాలికంగానో లేదా పూర్తిగానో రద్దయిపోతుంది.
క్రైస్తవ మతంలోకి మారిన దళిత వ్యక్తి ఎస్సీ హోదా గుర్తింపు కోల్పోతాడు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ రోజు సుప్రీంకోర్టు ఆమోదించింది. అంటే ఉద్యోగాలు, ప్రవేశాలు, ఇతర రిజర్వేషన్ ప్రయోజనాలు ఇక రావు.

ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిమితి

మతం మారిన వెంటనే ఎస్సీ/ఎస్టీ (ప్రివెంషన్ ఆఫ్ అట్రాసిటీస్) చట్టం కింది ప్రత్యేక రక్షణ కూడా కోల్పోతారు. అంటే అట్రాసిటీ కేసుల్లో ఎస్సీ గుర్తింపు ఉండాల్సిన షరతు కూడా ఇక వర్తించదు.
సుప్రీంకోర్టు మతం మారిన సమయంలో ఆ వ్యక్తి ఏ మతంలో ఉన్నాడో అది నిర్ణయిస్తుందని చెప్పింది. కేవలం జన్మ హక్కు లేదా పాత కాగితం (కాస్ట్ సర్టిఫికెట్) మాత్రం సరిపోదు.

ఈ తీర్పు ఏ కేసులో వచ్చింది?

చింతాడ అనంద్ పేర వచ్చిన పిటిషన్ (ఎస్సీ అట్రాసిటీ కేసులో క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి హోదా పై వివాదం) సందర్భంగా వచ్చింది. అతను క్రైస్తవ మతంలో ఉన్నప్పుడు అట్రాసిటీ కేసులో ఎస్సీ హోదా కోరాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతను హోదా కోల్పోయినట్లు చెప్పడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాడు. సుప్రీంకోర్టు ఆ తీర్పును ఈ రోజు సమర్థించింది.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular