*భూపాలపల్లి SP: సంకీర్త్
*ఘనంగా ఎస్పీ పుట్టిన రోజు
*ఎస్పీని కలిసిన ఉప సర్పంచ్ లు
స్పాట్ వాయిస్, భూపాలపల్లి : గురువారం నాడు ఉప సర్పంచ్ ల సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు గట్టు ప్రదీప్ గౌడ్ ఆధ్వర్యంలో భూపాలపల్లి SP సిరిశెట్టి సంకీర్త్ IPS గారి జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొట్ల కార్తీక్ గారు పాల్గొని SP గారికి శాలువాతో సన్మానం చేసి కేక్ కట్ చేసి ఉప సర్పంచ్ లు అందరు SP గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అనంతరం SP సంకీర్త్ గారు మాట్లాడుతూ గ్రామాల్లో యువత చెడు దారికి మళ్లకుండా సన్మార్గంలో వెళ్లే విధంగా ప్రజాప్రతినిధులు చూడాలని ఈ సందర్బంగా సూచించారు. ఉప సర్పంచ్ లు పోలీస్ లకు అభివృద్ధిలో సహకారంగా ఉండాలని కోరారు ఎక్కడ ఏ సమస్య ఉన్న నేరుగా ధైర్యంగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళవచ్చు అని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ల సంఘం రాష్ట్ర నాయకులు మామిడి కవిత, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి, గారు జిల్లా ఉపాధ్యక్షులు శంకర్, జిల్లా అధికార ప్రతినిథి బానేష్, రేగొండ మండల అధ్యక్షులు నరేష్, కొయ్యురు మండల అధ్యక్షులు సర్వేందర్, గోరి కొత్తపల్లి మండల అధ్యక్షులు పిండి ప్రభాకర్ మరియు వివిధ గ్రామాల ఉప సర్పంచ్ లు పాల్గొన్నారు.

