ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణప్రశాంతంగా దూరవిద్య పరీక్షలు..

ప్రశాంతంగా దూరవిద్య పరీక్షలు..

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న దూరవిద్య డిగ్రీ, పీజీ, లా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో పరీక్షల నియంత్రణ అధికారులు, పరిశీలకులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని డిబార్ చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి అపోహలకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. అసత్య ప్రచారాలను నమ్మి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడి డిబార్ కావడం ద్వారా భవిష్యత్తును నష్టపరుచుకోవద్దని కోరారు. దూరవిద్య పరీక్షలపై అసత్యాలను ప్రచారం చేసే కథనాలను ఖండించిన ఆయన.. పరీక్షలు నిబంధనల ప్రకారం పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular