ప్రశాంతంగా దూరవిద్య పరీక్షలు..

స్పాట్ వాయిస్, హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న దూరవిద్య డిగ్రీ, పీజీ, లా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో పరీక్షల నియంత్రణ అధికారులు, పరిశీలకులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని డిబార్ చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి అపోహలకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. అసత్య ప్రచారాలను నమ్మి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడి డిబార్ కావడం ద్వారా భవిష్యత్తును...