ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణనర్సంపేటలో గణేష్‌ నిమజ్జనానికి ట్రాఫిక్‌ ఆంక్షలు

నర్సంపేటలో గణేష్‌ నిమజ్జనానికి ట్రాఫిక్‌ ఆంక్షలు

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, నర్సంపేట: గణేష్‌ నిమజ్జనం సందర్భంగా నర్సంపేట పట్టణ, మండల నిర్వాహకులకు పోలీసులు రూట్‌మ్యాప్‌ ప్రకటించారు. పట్టణం నుంచి వచ్చే విగ్రహాలు అంబేద్కర్‌ సెంటర్‌–కమలాపురం క్రాస్‌–కమలాపురం మీదుగా మాదన్నపేట చెరువు కట్టకు చేరుకోవాలి. మాదన్నపేట, నాగుర్లపల్లి వైపు నుంచి వచ్చే విగ్రహాలు నాగుర్లపల్లి–పోలీస్‌స్టేషన్‌–అంబేద్కర్‌ సెంటర్‌–కమలాపురం క్రాస్‌–కమలాపురం మీదుగా కట్టకు వెళ్లాలి. నిమజ్జనం అనంతరం వాహనాలు చెరువు కట్ట–నాగుర్లపల్లి–పోలీస్‌స్టేషన్‌ మీదుగా ప్రధాన రోడ్డుకు చేరుకోవాలి. కమలాపురం వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేయగా, కట్టపైకి విగ్రహ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఒక్కో వాహనంలో ఇద్దరే ఉండాలని పోలీసులు సూచించారు. నిర్వాహకులు, భక్తులు సహకరించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular