ప్రధాన కార్యదర్శి గా దామెర ఎస్సై ఇమ్మడి. వీరభద్రరావు ఎన్నిక
స్పాట్ వాయిస్ హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని రాణి రుద్రమదేవి ప్రాంగణంలో గురువారం వరంగల్ పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్నికల నోడల్ అధికారి అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు సదయ్య, నాగయ్యల పర్యవేక్షణలో ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి.ఎన్నికల ప్రక్రియను పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పరిశీలించి, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ ఎన్నికల్లో వివిధ హోదాల్లోని 110 మంది పోలీస్ అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ధర్మసాగర్ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ కొండా కరుణాకర్, ప్రధాన కార్యదర్శిగా దామెర ఎస్ఐ ఇ. వీరభద్రరావు,ఉపాధ్యక్షులుగా బి. సతీష్, బి. శరత్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా టి. నరేష్, కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎస్. ప్రవీణ్ కుమార్, కోశాధికారిగా బి. నరేష్ లు ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక సభ్యులుగా ఎం. తులసి, సి.హెచ్. మహేందర్ యాదవ్, ఏ. రమేష్, ఎన్. ప్రవీణ్, ఎం.డి. తాజుద్దీన్, పి. సర్వేశ్ లు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు.


