వరంగల్ పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక..

ప్రధాన కార్యదర్శి గా దామెర ఎస్సై ఇమ్మడి. వీరభద్రరావు ఎన్నిక   స్పాట్ వాయిస్ హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని రాణి రుద్రమదేవి ప్రాంగణంలో గురువారం వరంగల్ పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్నికల నోడల్ అధికారి అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు సదయ్య, నాగయ్యల పర్యవేక్షణలో ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి.ఎన్నికల ప్రక్రియను పోలీస్ కమిషనర్ ఎన్....