ePaper
Saturday, September 12, 2026
ePaper
Homeతెలంగాణరాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు కేజీబీవీ కాటారం విద్యార్థినీలు ఎంపిక

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు కేజీబీవీ కాటారం విద్యార్థినీలు ఎంపిక

📰 Generate e-Paper Clip

కాటారం, స్పాట్ వాయిస్ : ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కేజీబీవీ కాటారంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలై 27న జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినీలను అభినందించారు.

అండర్-12 విభాగంలో చెన్నూరి అమ్ములు (60 మీటర్ల పరుగు), గావిడి మైత్రి (షాట్‌పుట్/బ్యాక్ త్రో), అండర్-14 విభాగంలో బొల్లి రిషిత (కిడ్స్ జావెలిన్ త్రో), అండర్-18 విభాగంలో బక్కతట్ల శ్రావణి, పాగె రష్మిత (200 మీటర్ల పరుగు) రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఆగస్టు 7న హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నారు. ఎంపికైన విద్యార్థినీలను పీఈటీ రాజేశ్వరి, ప్రిన్సిపాల్ చల్ల సునీత అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular