ePaper
Saturday, September 12, 2026
ePaper
Homeతెలంగాణబీజేపీలో కాంగ్రెస్ నాయకుల చేరిక

బీజేపీలో కాంగ్రెస్ నాయకుల చేరిక

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్ , కాజీపేట:కాజీపేట 62వ డివిజన్ పరిధిలోని సోమిడి హనుమాన్ నగర్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. డివిజన్ అధ్యక్షుడు మేకల శ్రావణ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిందని తెలిపారు. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మామునూర్ ఎయిర్‌పోర్టు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. జక్కుల రాజు యాదవ్, జక్కుల రంజిత్, రమేష్, ఆదిత్య, కాయిత రాజ్‌కుమార్, సాయి కృష్ణ, జంపుల్, అభినవ్ తదితరులు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సంపత్ రెడ్డి, అరణ్య రెడ్డి, అనిల్ యాదవ్, కాయిత వేణుగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular