ePaper
Tuesday, September 8, 2026
ePaper
Homeతెలంగాణబాధితుడికి మొబైల్ ఫోన్ అప్పగింత

బాధితుడికి మొబైల్ ఫోన్ అప్పగింత

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, ​గణపురం: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను గుర్తించి బాధితుడికి అప్పగించినట్లు గణపురం ఎస్సై అశోక్ తెలిపారు. మండల పరిధిలో ఇటీవల దొరికిన ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేసి అసలు యజమానిని గుర్తించారు. బాధితుడిని మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, ఆధారాలు పరిశీలించిన అనంతరం ఫోన్‌ను అతనికి అప్పగించారు. పోయిందనుకున్న ఫోన్ తిరిగి చేతికందడంతో బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular