ePaper
Wednesday, September 9, 2026
ePaper
Homeతెలంగాణపండుగ సాయన్న జయంతి, వర్ధంతులపై అధికారిక ఉత్తర్వులు

పండుగ సాయన్న జయంతి, వర్ధంతులపై అధికారిక ఉత్తర్వులు

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, తెలంగాణ: పండుగ సాయన్న జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ముదిరాజ్ సమాజ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరిని కలిసి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలిపారు. పండుగ సాయన్న జయంతిని అక్టోబర్ 22న, వర్ధంతిని డిసెంబర్ 10న ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయన్న పోరాటం, త్యాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం ముదిరాజ్ సమాజంతో పాటు బహుజన సమాజానికి గర్వకారణమన్నారు. ఈ నిర్ణయానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular