ePaper
Friday, September 11, 2026
ePaper
Homeతెలంగాణపుట్ట మధుపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదు

పుట్ట మధుపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదు

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్ మల్హర్: పుట్ట మధుపై కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు, వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని బీఆర్‌ఎస్ నాయకుడు బానోత్ రాజ్‌కుమార్ అలియాస్ ఢిల్లీ రాజు హెచ్చరించారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ఆన్సాన్‌పల్లిలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన మహిళలకు రూ.2,500, రూ.4,000 పింఛన్లు, స్కూటీలు, తులం బంగారం వంటి హామీల అమలుపై ప్రశ్నిస్తున్నందుకే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మంథనికి చేసిన అభివృద్ధిపై సమాధానం చెప్పకుండా చౌకబారు రాజకీయాలకు దిగుతున్నారని ఆరోపించారు. పుట్ట మధు వద్ద గతంలో సహాయం పొందిన వారు ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. పుట్ట మధు స్టూడెంట్ లీడర్‌గా మొదలై ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎదిగారని పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలు కొనసాగితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాసర్ల రాజయ్య, లావుడ్యా శ్రీనివాస్, నాంసాని కుమార్, పోతుగంటి రవి, బానోత్ తిరుపతి, గుగులోత్ తిరుపతి, ప్రశాంత్, అజ్మీరా దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular