స్పాట్ వాయిస్, క్రైమ్ : మహబూబాబాద్ పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ బిందు మాధవి టౌన్ సీఐ రఘుపతి రెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. విద్యార్థినుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

