ePaper
Friday, September 11, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్రఘునాథపల్లిలో మరో బైక్ చోరీ..

రఘునాథపల్లిలో మరో బైక్ చోరీ..

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్ ,రఘునాథపల్లి: రఘునాథపల్లి మండల కేంద్రంలో మరో బైక్ చోరీ ఘటన చోటుచేసుకుంది. స్థానికుడు దుబ్బాక హరీష్ గౌడ్‌కు చెందిన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు సమాచారం.హరీష్ తన ద్విచక్ర వాహనాన్ని రైల్వే స్టేషన్ సమీపంలో పార్క్ చేసి వెళ్లగా, తిరిగి వచ్చేసరికి బైక్ కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.మండల కేంద్రంలో ఇటీవల వరుస చోరీ ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular