స్పాట్ వాయిస్, దామెర :దామెర మండలం ఊరుగొండ గ్రామంలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.7,580 నగదు, 6 సెల్‌ఫోన్లు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దామెర ఎస్‌ఐ కొంక అశోక్ మాట్లాడుతూ పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు సమాజానికి హానికరమని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు తమ పరిసరాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని సూచించారు.

