ePaper
Friday, September 11, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్డీసీఎం ఢీకొని వృద్ధుడి మృతి..

డీసీఎం ఢీకొని వృద్ధుడి మృతి..

📰 Generate e-Paper Clip

గణపురంలో ఘటన

​స్పాట్ వాయిస్, గణపురం:రోడ్డు దాటుతుండగా డీసీఎం వ్యాన్ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని బుర్రకాయలగూడెంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుర్రకాయలగూడెం గ్రామానికి చెందిన బూర మల్లయ్య (70) ఆదివారం రాత్రి కాలినడకన రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఆయనను బలంగా ఢీకొట్టింది.​ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లయ్యను స్థానికులు వెంటనే 108 లో  జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular