ePaper
Thursday, September 10, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు.. 

మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు.. 

📰 Generate e-Paper Clip

మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు.. 

ఎంపిడిఓ సహా ముగ్గురు అరెస్ట్

స్పాట్ వాయిస్, నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించి ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్యతో పాటు ఎంపిడిఓ కుమారుడు రాంప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. పడమటి గూడెం గ్రామంలో ఒక వెంచర్‌కు అనుమతి ఇవ్వడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా 45 వేల రూపాయలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే ఎంపిడిఓ కార్యాలయంలో అనేక వ్యవహారాలు చక్కబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంపిడిఓ కుమారుడు రాంప్రసాద్ కూడా ఈ వ్యవహారంలో భాగస్వామిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ముగ్గురినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular