ePaper
Wednesday, June 10, 2026
ePaper
Homeతెలంగాణహనుమకొండమండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా దుబాసి నవీన్

మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా దుబాసి నవీన్

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్ దామెర:మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా దమ్మన్నపేట గ్రామ సర్పంచ్ దుబాసి నవీన్, ప్రధాన కార్యదర్శి గా పులుకుర్తి గ్రామ సర్పంచ్ పెంచాల స్వరూప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం నూతనంగా మండల సర్పంచుల ఫోరం ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పసరగొండ, తక్కల్లపాడ్ సర్పంచులు కొట్టే శ్రీవాణి రమేష్,దాడి వసంత రమేష్,కమిటీ సభ్యులుగా కొగిల్వాయు, సింగరాజుపల్లి సర్పంచులు చుక్క వనిత మహేందర్, ఒడ్డేపల్లి చంద్రం లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దుబాసి నవీన్ మాట్లాడుతూ… అధికారులు, సర్పంచులు, ప్రజల సహకారంతో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ, గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడతానని అన్నారు. తనమీద నమ్మకంతో బాధ్యతను అప్పగించిన సర్పంచులకు,ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular