ప్రజలను కాంగ్రెస్, బీజేపీ మోసం చేస్తున్నాయ్..
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సోమవారం రఘునాథపల్లి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, రానున్న రోజుల్లో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామన్నారు. ఈనెల 6న వరంగల్ లో జరిగే రైతు సభకు పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు తరలిరావాలని ఆయన కోరారు. ప్రజలను కాంగ్రెస్, బీజేపీలు మోసం చేస్తున్నాయని, వాటికి భవిష్యత్ లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా పాలన పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. యువతకు నిరుద్యోగ భృతి, విద్యార్థులకు స్కూటీలు, ప్రతీ కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళకు రూ.2500, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తామని నేటికీ అమలు చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, స్టేషన్ ఘనపురం నియోజవర్గ ఇన్ చార్జ్ వై కుమార్ గౌడ్, మండల నాయకులు మునిపట్ల విజయ్, జిల్లా నాయకులు గూడ కిరణ్ కుమార్, దేవర యాకయ్య, లోకుంట్ల సుజన్ కుమార్, బండి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

