ePaper
Wednesday, June 10, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల మృతి..!

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల మృతి..!

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ స్టేజి సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సమాచారం.మృతులు దంతాలపల్లి మండలం బొడ్లడ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular