ePaper
Thursday, May 14, 2026
ePaper
Homeతెలంగాణజయశంకర్ భూపాలపల్లిపది ఫలితాల్లో గణపురం జెడ్పీహెచ్‌ఎస్‌ ప్రభంజనం

పది ఫలితాల్లో గణపురం జెడ్పీహెచ్‌ఎస్‌ ప్రభంజనం

📰 Generate e-Paper Clip

​వంద శాతం ఉత్తీర్ణతతో ఆదర్శం

​517 మార్కులతో ఫాహిమా టాప్‌

స్పాట్ వాయిస్, ​గణపురం: పదో తరగతి ఫలితాల్లో గణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. అందరూ ఉత్తీర్ణులై 100 శాతం ఫలితాలను నమోదు చేశారు. విద్యార్థిని ఫాహిమా 517 మార్కులతో పాఠశాల టాపర్‌గా నిలవగా, జోష్ణ 456 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచింది. మిగిలిన విద్యార్థులు సైతం ఉత్తమ మార్కులతో పాసయ్యారు. ​ఉపాధ్యాయుల ప్రత్యేక శిక్షణ, విద్యార్థుల కృషి వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైందని ఎంఈవో మహ్మద్ అఫ్రోజ్, ప్రధానోపాధ్యాయుడు దేసు సతీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను గ్రామ పెద్దలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు ఘనంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular