స్పాట్ వాయిస్, రేగొండ: రేగొండ శివారులోని రంగారావు కుంట చెరువు దగ్గర రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుల మీద ఉన్న వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాంధీనగర్ కు చెందిన దొంగల చందు వయసు (27), రంగయ్యపల్లికి చెందిన సిలువేరు పైడి (50 ) సీతరాంపూర్ కు చెందిన కుమార్ యాదవ్ గాయపడ్డారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో గాయపడిన వ్యక్తులను రేగొండ ఎస్సై సుధాకర్ తన సొంత వాహనంలో పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు.
రెండు బైకులు ఢీ : ముగ్గురికి తీవ్ర గాయాలు
RELATED ARTICLES

