ePaper
Monday, October 19, 2026
ePaper
Homeతెలంగాణభక్తిశ్రద్ధలతో సద్దుల బతుకమ్మ వేడుకలు

భక్తిశ్రద్ధలతో సద్దుల బతుకమ్మ వేడుకలు

📰 Generate e-Paper Clip

 

స్పాట్ వాయిస్, హనుమకొండ: బీజేపీ రాష్ట్ర నాయకురాలు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రావు పద్మారెడ్డి హంటర్ రోడ్డులోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, స్థానిక మహిళలతో కలిసి సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, మహిళలతో కలిసి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ప్రకృతిని పూజించే విశిష్ట పండుగ బతుకమ్మ అని, గౌరమ్మ ఆశీస్సులతో తెలంగాణ ఆడపడుచులందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular