మూడు స్థానాల భర్తీ వేళ కాంగ్రెస్‌లో కొత్త సమీకరణాలు
స్పాట్ వాయిస్, తెలంగాణ: తెలంగాణలో నవంబర్‌లో మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సందడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవి కోసం నీలం మధు ముదిరాజ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీకి చేసిన సేవలు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు అవకాశం దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ పదవీకాలం ముగియనుండటంతో మూడు స్థానాల భర్తీపై చర్చ మొదలైంది. వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు పదవులపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో, కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరికి అవకాశం కల్పిస్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. అయితే నీలం మధు ముదిరాజ్ పేరుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

