ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeజాతియంఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు

ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు

📰 Generate e-Paper Clip

స్పీకర్‌ నిర్ణయం రద్దు.. ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ

స్పాట్‌ వాయిస్‌, హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. పార్టీ ఫిరాయింపులపై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్‌, ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.

2023లో బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన దానం నాగేందర్‌ అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. దీనిపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్‌ వాటిని తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు.

తీర్పుపై కేటీఆర్‌ ‘సత్యమేవ జయతే’ అంటూ స్పందించారు. మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ ఇదే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. కౌశిక్‌రెడ్డి స్పందిస్తూ ఇది బీఆర్‌ఎస్‌ విజయమని, మిగిలిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular