ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeతెలంగాణకోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నా భూమిపై వివాదం

కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నా భూమిపై వివాదం

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, కమలాపూర్:  మండలంలోని అంబాల గ్రామానికి చెందిన 86 ఏళ్ల రైతు సందసాని లక్ష్మీనారాయణ తన భూమికి సంబంధించి న్యాయం చేయాలని కోరారు. గురువారం హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ సర్వే నంబర్లు 789/ఈ, 789/డీలోని 2.10 ఎకరాల భూమిపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోందన్నారు. కోర్టు నుంచి ఇంజక్షన్, పోలీస్ ప్రొటెక్షన్ ఆదేశాలు ఉన్నప్పటికీ జూలై 2న భూమిలో పనులు చేపట్టి పంట సాగు చేస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ భూమికి సంబంధించి పోలీస్, కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular