స్పాట్ వాయిస్, బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు చెందిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత పోలీస్ పరీక్షల కోచింగ్ అందించేందుకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ల సహకారంతో చేపడుతున్న ఈ పరీక్షను సెప్టెంబర్ 20న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు సెప్టెంబర్ 19 రాత్రి 8 గంటల్లోపు గూగుల్ ఫామ్ ద్వారా నమోదు చేసుకోవాలి. పరీక్ష కేంద్రాలు వరంగల్ సీకేఎం కాలేజీ, హనుమకొండ ఎస్వీఎస్ కాలేజీ, జనగామ సీజేఐటీ ఇంజినీరింగ్ కాలేజీ, పరకాల ప్రభుత్వ జూనియర్ కాలేజీ, నర్సంపేట బిట్స్ కాలేజీల్లో ఏర్పాటు చేశారు.

