ePaper
Tuesday, September 15, 2026
ePaper
Homeతెలంగాణమట్టి గణపతులతోనే పర్యావరణ పరిరక్షణ” – ఝాన్సీ రాజేందర్‌రెడ్డి

మట్టి గణపతులతోనే పర్యావరణ పరిరక్షణ” – ఝాన్సీ రాజేందర్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, పాలకుర్తి:పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మట్టి గణపతిని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కోసం ప్రార్థించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నీటి వనరులు కలుషితమవుతున్నందున ప్రతి కుటుంబం, గ్రామం, కాలనీలో మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని ఆమె పిలుపునిచ్చారు. మట్టి విగ్రహాల వినియోగంతో పర్యావరణాన్ని కాపాడి భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించవచ్చన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా, యువజన నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular