ePaper
Monday, September 7, 2026
ePaper
Homeజాతియంకొండా సురేఖపై చర్యలు ఖాయమా?..

కొండా సురేఖపై చర్యలు ఖాయమా?..

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌, స్పాట్ వాయిస్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళనకు సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే వారం, పది రోజుల్లో కేబినెట్‌ విస్తరణ జరిగే అవకాశం ఉందని సమాచారం. మంత్రి కొండా సురేఖపై అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందా? అనే అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. సురేఖపై చర్యల జాప్యం, సీఎం రాహుల్‌గాంధీతో భేటీ కావడం చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా, ఒకరిద్దరు మంత్రులను తప్పించే అవకాశంపైనా ప్రచారం సాగుతోంది. కొత్త నియామకాల్లో జిల్లాలు, సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular