అధ్యక్షుడిగా పట్టేం కోటిలింగం..
స్పాట్ వాయిస్, రేగొండ: రేగొండ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి రేగొండ మండల ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అడహక్ కమిటీ సభ్యులు కటకం రాజు, అంబాల రవీందర్, బండి సోమయ్య ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. 33 మంది జర్నలిస్టులకు గాను 21 మంది హాజరై కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పట్టేం కోటిలింగం, గౌరవ అధ్యక్షుడిగా కటకం రాజు, గౌరవ సలహాదారుడిగా బోట్ల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా పకిడే నవీన్, ఉపాధ్యక్షులుగా రోంటాల శంకర్, బండారి రాజు, కోశాధికారిగా బండి కమలాకర్, సహాయ కార్యదర్శులుగా మోటం రాజు, మంతెన మధు, సంయుక్త కార్యదర్శిగా బండారి తిరుపతి, ప్రచార కార్యదర్శిగా గునుకంటి రాకేష్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బొమ్మకంటి నవత్, మ్యాదరబోయిన రాజు, మార్తా రాజు ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని కోటిలింగం తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎండీ రహీం, మంతెన సురేష్, అక్కల రమేష్, అమ్మ పవన్ తదితరులు పాల్గొన్నారు.

