ePaper
Thursday, May 14, 2026
ePaper
Homeతెలంగాణజయశంకర్ భూపాలపల్లిమక్కలను వెంటనే కొనుగోలు చేయాలి..

మక్కలను వెంటనే కొనుగోలు చేయాలి..

📰 Generate e-Paper Clip

మక్కలను వెంటనే కొనుగోలు చేయాలి..

మాజీ ఎమ్మెల్యే గండ్ర..

రోడ్డు పై భైఠాయించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలు..

రైతుసదస్సుకి రైతులు పెద్ద ఎత్తున తరలాలి

స్పాట్ వాయిస్, రేగొండ:రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం రేగొండ మండలం కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రంను పరిశీలించారు. అనంతరం రేగొండలో ప్రధాన రహదారిపై ఆదివారం బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే మక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని లేని పక్షంలో రైతుల పట్ల బీ ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామన్నారు. ప్రభుత్వం మేడలు వంచి రైతులకు న్యాయం చేకూరేలా కార్యాచరణ చేపడతామనీ హెచ్చరించారు.వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించి రైతులను మోసం చేస్తూ మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులను ఈ ప్రభుత్వం ఏవిధంగా మోసం చేసిందో మనం చూస్తూ ఉన్నామన్నారు.

రైతుల పక్షాన బీ ఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్న రైతుసదస్సు కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచేస్తున్నారని రైతులు, బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్ని కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రేగొండ మండల పార్టీ అధ్యక్షులు అంకం రాజేందర్, గోరి కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఎంఏ హమీద్, గండ్ర యువసేన అధ్యక్షులు సూదనబోయిన సుమన్, టౌన్ ప్రెసిడెంట్ రఘు సాల తిరుపతి, పిఎసిఎస్ డైరెక్టర్ సామల పాపిరెడ్డి మండల ఉపాధ్యక్షుడు కానుగంటి శ్రీనివాస్, దమ్మన్నపేట సర్పంచ్ గంజి అరుణ రజనీకాంత్, మాజీ సర్పంచ్ బానోత్ బిక్కియనాయక్, చింతం కిరణ్, బొమ్మ తిరుపతి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular