ePaper
Tuesday, April 21, 2026
ePaper
Homeతెలంగాణహనుమకొండవిద్యార్థులకు వృత్తి విద్యా నైపుణ్యంపై శిక్షణ

విద్యార్థులకు వృత్తి విద్యా నైపుణ్యంపై శిక్షణ

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, పరకాల: పరకాల పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థులకు సమగ్ర శిక్షా అభిమాన్ – ఆధ్వర్యంలో వృత్తి విద్యా నైపుణ్యం శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణకుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆటోమేటివ్ రంగంలో క్షేత్రస్థాయి అనుభవం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఆటోమోటివ్ రంగంలో ఉపాధి అవకాశాలు, అభివృద్ధి, డిఫెన్స్ రంగంలో ఆటోమోటివ్ ప్రాముఖ్యత, సమకాలిన ప్రపంచంలో ఆటోమోటివ్ ప్రాముఖ్యత మొదలగు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ సహకారంతో అందిస్తున్న ఈ శిక్షణ విద్యార్థుల ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు నైపుణ్యాలను నేర్పిస్తున్న సెలెక్ట్ ఆటోమేటివ్ సర్వీస్ పాయింట్ బృంద సభ్యులు, ఉపాధ్యాయులు శ్రీనివాస్ ను, ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణకుమారి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular