ePaper
Monday, September 7, 2026
ePaper
Homeతెలంగాణ420 హామీలు ఏమయ్యాయి...?

420 హామీలు ఏమయ్యాయి…?

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, భూపాలపల్లి:  కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు 420 హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. హామీల అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. హామీలు అమలు చేసే వరకు ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రాస్తారోకోతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular