హైదరాబాద్, స్పాట్ వాయిస్: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన నివాసంలో రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహాలక్ష్మి, ఇందిరా మహిళా శక్తి, అమ్మ ఆరోగ్యం వంటి పథకాలతో మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.

