ePaper
Monday, September 7, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

📰 Generate e-Paper Clip

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

స్పాట్ వాయిస్, కాజీపేట: కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్ప సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట వైపు నుంచి టీఎస్ 03 ఈజీ 9580 నంబర్ గల ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ వ్యక్తి రాజీవ్ గృహకల్ప మూల మలుపు వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.సమాచారం అందుకున్న మడికొండ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular