ePaper
Sunday, August 2, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్3 గంటల్లోనే మిస్సింగ్ కేసు ఛేదన

3 గంటల్లోనే మిస్సింగ్ కేసు ఛేదన

📰 Generate e-Paper Clip

బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన దామెర ఎస్సై కొంక అశోక్ 

స్పాట్ వాయిస్, దామెర: దామెర పోలీస్ స్టేషన్ లో నమోదైన మిస్సింగ్ కేసును.. మూడు గంటల్లోనే దామెర ఎస్సై కొంక అశోక్ ఛేదించారు. ఊరుగొండ కు చెందిన బాలిక చాపర్తి సాత్విక (13) శనివారం ఇంటి వద్ద కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ అశోక్.. తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం మూడు గంటల్లోనే బాలికను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. త్వరితగతిన కేసు ఛేదించి బాలిక ను తల్లిదండ్రులకు అప్పగించడంతో బాలిక తల్లిదండ్రులు దామెర ఎస్సై అశోక్ తో పాటు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular