ePaper
Monday, September 7, 2026
ePaper
Homeతెలంగాణమల్హర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్న: మంత్రి శ్రీధర్‌బాబు

మల్హర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్న: మంత్రి శ్రీధర్‌బాబు

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, మల్హర్: భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరులో నూతన నయారా పెట్రోల్ బంక్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదివారం ప్రారంభించారు. అనంతరం రూ.45 లక్షలతో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కేంద్రం (ఎస్పీఎం)ను ప్రారంభించారు. కాటారం డివిజన్‌లోని ఐదు మండలాల రైతులకు వేగంగా సేవలు అందుతాయని తెలిపారు. తాడిచర్ల–భూపాలపల్లి రహదారితో పాటు కొయ్యూరు–మల్లారం, మల్లారం–పెద్దతుండ్ల రోడ్లకు నిధులు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో అయిత ప్రకాష్‌రెడ్డి, బట్టు కరుణాకర్, కోట రాజబాబు, అయిత రాజిరెడ్డి, కొండ రాజమ్మ, జంగిడి శ్రీనివాస్, బొమ్మ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular