ePaper
Friday, May 15, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్మల్హర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 

మల్హర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 

📰 Generate e-Paper Clip

మల్హర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 

ఒకరు మృతి, మరొకరికి గాయాలు

స్పాట్ వాయిస్, మల్హర్ :  మల్హర్ మండలం నాగులమ్మ క్రాస్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.మంథని నుండి కాటారం వెళ్తున్న ఇసుక లారీ, కాటారం నుండి తాడిచెర్ల కి వెళ్తున్న బొగ్గు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదం సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి.. సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. . ప్రమాదంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular