ePaper
Sunday, August 2, 2026
ePaper
Homeతెలంగాణరఘునాథపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నేతల ధర్నా

రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నేతల ధర్నా

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: నర్సంపేట డిపో ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో నివాళులర్పించేందుకు వెళ్తున్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, మాలోతు కవితను రఘునాథపల్లి పోలీసులు వారిని అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటనే రఘునాథపల్లి పోలీస్ స్టేషన్‌కు కార్యకర్తలతో చేరుకొని, స్టేషన్ ఎదురుగా బైఠాయించారు. బీఆర్‌ఎస్ నాయకులను విడుదల చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా, వారి మరణానికి కారణమైందని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి వారి అపాయింట్మెంట్ డేటును ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular