ePaper
Sunday, August 2, 2026
ePaper
Homeతెలంగాణప్రేమ కోసం 'టవర్' ఎక్కిన యువకుడు

ప్రేమ కోసం ‘టవర్’ ఎక్కిన యువకుడు

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో శుక్రవారం కలకలం రేగింది. తన ప్రేయసితో మాట్లాడించాలంటూ..ఓ యువకుడు హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారావుపేట గ్రామానికి చెందిన సూర రాజు అనే యువకుడు శుక్రవారం సాయంత్రం మోరంచ సమీపంలోని విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ టవర్‌ ఎక్కాడు. తాను మనసు పడిన యువతి తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసిందని, ఆమెతో వెంటనే మాట్లాడించాలని, లేనిపక్షంలో కిందకు దిగేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుమారు 2 గంటల పాటు రాజుకు నచ్చజెప్పి క్షేమంగా కిందకు దించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular